తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తను సినిమాల్లో నటించడం అసలు మా అమ్మకు ఇష్టం లేదు. నేను డెంటల్ కోర్స్ చేశాను.
నటిగా రాణించాలని నా మనసులో ఉంది. ఒకరోజు వాళ్లకు ఆమిర్ ఖాన్ మూవీ త్రీ ఇడియట్స్ సినిమా చూపించాను. అందులో తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎలా ప్రయత్నించారో తెలుసుకున్నారు. ఆ సినిమా చూశాక మా అమ్మ నాన్న సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారని చెప్పుకోచ్చింది.