Home / SLIDER / మునుగోడుకు సీఎం కేసీఆర్‌

మునుగోడుకు సీఎం కేసీఆర్‌

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడులో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.

సభావేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు.ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో  హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరనున్నారు.ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్‌ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.సీఎం కేసీఆర్‌ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat