టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.
