కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే..
కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని 2017లో స్కూల్ టీచర్‌కు చెప్పింది. నిజమని నమ్మిన టీచర్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యారు.
తాజాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని రుజువైంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు తనని ఎవరో తాకుతున్నట్లు అనిపిస్తోందని, పీడకలలు వస్తున్నాయని చిన్నతనంలోనే ఆమె నోట్స్‌లో రాసుకుంది. బాలిక మెంటల్ కండీషన్ బాగోలేక అలా చెప్పిందని, బాలిక తండ్రిని నిర్దోషిగా తేల్చి అతన్ని విడుదల చేశారు. మహారాష్ర్ట అంధేరిలోని డీఎన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.