తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ నీటి తరలింపుకు రూ.25.71 కోట్లు ఖర్చయింది. ఎకరం సాగుకు రూ.21,810 వరకు వ్యయమైంది. ఏడాదికి రూ.8,541 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఖర్చు కంటే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags anumula revanth reddy bandi sanjay kumar bjp congress guntakandla jagadeesh reddy kaleshwaram Kaleshwaram lift irigation KALVAKUNTLA KAVITHA kcr komatireddy rajagopalreddy komatireddy venkatareddy ktr ktrtrs munugode by elections nalgonda slider telangana telangana bjp telanganacm telanganacmo telanganacongress telanganagovernament thanneeru harish rao thr tpcc trs trsgovernament trswp ys sharmila ysrtp