ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
