బిహార్ రాష్ట్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, 2004లో ఎంపీగా గెలిచారు.
