చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. లక్షణాలను బట్టి కేవలం ఉపశమన చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
లక్షణాలు ఇవే..
ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, దగ్గు, నీరసం, వాంతులు, కండరాల నొప్పులు, వికారం, అనోరెక్సియా లక్షణాలు కనిపిస్తాయి.