దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో 4,33,65,890 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,26,396 మంది మరణించారు. మరో 1,43,989 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకున్నారు.