ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ 2014ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటికి రెండు సార్లు అధికార పగ్గాలను దక్కించుకుని ఎనిమిదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి.
రోజుకి ఇరవై నాలుగంటలుంటే.. గంటకు అరవై నిమిషాలుంటే నిమిషానికి మోదీ సర్కారు రెండు కోట్ల రూపాయల అప్పును చేస్తుంది. మనం సహజంగా కన్నుమూసి రెప్ప తెరవడానికి పట్టే సమయం చాలా చాలా తక్కువ. అంటే సెకండ్లో పదోవంతు కూడా ఉండదు.
అయితే ఆసమయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అప్పు అక్షరాల రూ. 3.38లక్షలు. చాయ్ తాగినంత సమయంలోనే మోదీ సర్కారు అక్షరాల రూ.2కోట్ల అప్పు చేస్తుంది. అంటే గంటకు రూ.120కోట్లు రోజుకు మొత్తం 2880కోట్లు అప్పు చేస్తుంది. ఇప్పటివరకు చేసిన అప్పుల మొత్తం అక్షరాల రూ.152,17,910కోట్లు. దీంతో ప్రతి పౌరుడిపై రూ.11లక్షల రుణ భారం పడనున్నది.