తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. ఇప్పటికే ఓ హీరోయిన్ పూజాహెగ్దేని ఎంపిక చేయగా, మరొకరి కోసం చిత్ర యూనిట్ అన్వేషిస్తోంది. ఆగస్టు రెండో వారంలో రామ్-లక్ష్మణ్ రూపొందించే యాక్షన్ ఎపిసోడ్తోనే మూవీ ప్రారంభం కానుందని సమాచారం.