ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ హయాంలో 264, వైసీపీ హయాంలో 869 ఏర్పాటయ్యాయి. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. Al, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్ లెస్ కంప్యూటింగ్ లాంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
