తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. మరో 3, 4 రోజుల పాటు వర్గాలు ఉన్నందున ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి నది పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అలెర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
