నిన్న గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 రన్స్కే ఆలౌటైంది.
టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(0), ధావన్ (9), కోహ్లి(16), పంత్ (0), సూర్య (27), హార్దిక్ (29), జడేజా(29), షమీ(23) రన్స్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో టోప్లే 6 వికెట్లు, డేవిడ్ విల్లీ, బైడన్ కార్సే, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ తలా ఒక వికెట్ తీశారు.