నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్గా వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పారు. హ్యాపీ బర్త్డే సినిమా ప్రమోషన్ష్లో భాగంగా ఓ ఇంటర్వూలో చైతూ సరసన ఎందుకు నటించలేదని ఓ విలేకర్ అడగగా.. చైతన్య పక్కన నేనెందుకు ఆ రోల్ చేస్తా అని అన్నారు లావణ్య.
సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున, లావణ్య జంటగా నటించారు. బంగార్రాజులో వారి కొడుకే చైతన్య. చైకు తల్లిగా లావణ్య యాక్ట్ చేస్తే బాగోదని భావించిన చిత్ర బృందం సీక్వెల్లో హీరో తల్లి చనిపోయినట్లు చూపించారు. ఇదే విషయాన్ని లావణ్య చెప్తూ.. చైతో యుద్ధం శరణం సినిమాలో నటించిన నేను ఈ సినిమాలో తల్లిగా ఎందుకు నటిస్తా అని అన్నారు.