కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్‌బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖల బంధువులు కూడా ఉన్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణ సోదరి లలిత చనిపోగా.. మనవరాలు హరిత కూతురు అశ్విత కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇక క్షతగాత్రుల్లో 21 మందిని ఆస్పత్రికి తరలించగా వారిలో 17 మంది డిశ్చార్జి అయ్యారని, మరో నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని సమాచారం.