ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మీటింగ్లు భారీ బహిరంగసభలను తలపించడం.. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్రబాబుకు చేరవేస్తున్నాయి.
జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్లు స్కెచ్లు వేస్తున్నావాటిని జగన్ తిప్పికొడుతున్నారు. అంతే కాకుండా జగన్కు వ్యతిరేకంగా ఎల్లో మీడియా వారు ఎన్ని కథనాలు వడ్డించినా అవేమి పట్టించుకోకుండా జనాలు మాత్రం వేలాదిగా తరలి వస్తున్నారు.
దీంతో ఖంగుతిన్న చంద్రబాబు సర్కార్ బ్యాచ్ జగన్ పాదయాత్ర పై నిఘాను మరింత పెంచింది. ఎంతలా అంటే అత్యాధునిక పరికరాలు వాడుతూ.. జగన్ను కలిసేందుకు వచ్చని జనాల నుండి ఎటువంటి స్పందన వస్తోంది.. జగన్కు జనమంతా ఎమోషనల్గా ఎంతలా కనెక్ట్ అవుతున్నారు.. అనే విషయాల పై నిఘాను పెంచారని ఒక ప్రముఖ మీడియా కథనాన్ని ప్రచురించింది.
జగన్ పాదయత్రలో భాగంగా నిర్వహిస్తున్న మీటింగులకు కనీ వినీ ఎరుగని రీతిలో జనం వస్తుండగా.. వారంతా నిజంగానే జగన్ పై ఉన్న అభిమానంతో వచ్చారా.. లేక ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వచ్చారా.. అంతే కాకుండా జగన్ దృష్టికి జనం తెస్తున్న సమస్యలను ముందుగానే తెలుసుకోవాలని పూర్తిగా నిఘా పెట్టి మరీ ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయని.. జగన్ వద్దకు సమస్యలు తీసుకొని రాకండా ఉండడాని జనాలను చెదరగొట్టేందు కూడా స్కెచ్ వేస్తున్నారని ఆ మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.