కృష్ణా నది బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 19 మందికి చేరింది. ఇక ఈ ప్రమాదంతో రాష్ట్రమంతా విషాద ఛాయలు అలుముకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జోకులు వేస్తున్నారు. ఇప్పటికే బోటు ప్రమాదం వెనుక కొందరు టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా బోట్లు నడుపున్నారని.. వాటిలో ఎక్కువశాతం అనధికార అనుమతులతో తిరిగే బోట్లే ఎక్కువగా ఉన్నాయని.. వారికి కొందరు మంత్రులు కూడా పరోక్షంగా మద్దతు తెలపడంతో వీరికి అధికారులు కూడా భయపడాల్సి వస్తోందని సమాచరం.
ఇక అసలు విషయం ఏంటంటే ప్రమాదం జరిగి 24 గంటలు కావస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలోనే ఉన్నా ఇప్పటి వరకు ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి పరామర్శించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రమాదానికి తగు కారణాన్ని కూడా తేల్చేశారు చంద్రబాబు. అఖిల ప్రియ పర్యాటక మంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఆ శాఖ పై మంచి పట్టు లేకపోవడం వలనే ప్రమాదం జరిగిందని టెలికాన్ఫరెస్స్ లో అన్నట్లు తెలిసింది.
నెలవారీ సమీక్షలు చేయకపోవడం, ఆ ప్రాంతాల్లో పర్యటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన మంత్రులు తమ శాఖపై పూర్తి అవగాహన లేకపోతే ఇలాంటి తప్పిదాలే జరుగుతాయని ఆయన సీరియస్ కూడా అయ్యారని తెలుస్తోంది. ఇంతమంది ప్రాణాలు బలిగొనడానికి అధికారుల నిర్లక్ష్యం అని కూడా కారణమని చెబుతున్నారు. దీంతో రాజకీయ వర్గాలు చంద్రబాబు పై మండిపడుతున్నారు. ఏదైనా మంచి జరిగితే అది కేవలం నా వల్లే అని డప్పు కొట్టే చంద్రబాబు.. ఏదైనా చెడు జరిగితే మాత్రం ఎదుటి వారిపై తోసేయడం అలవాటుగా చేసుకున్నారు. గతంలో పుష్కరాలలో అనేక మందిని పొట్టనపెట్టుకున్నారు.. మొన్నటికి మొన్న బస్సుప్రమాదంలో చాలామంది ప్రాణాలను బలికొన్నారు.. ఇప్పుడు కృష్ణా నది బోటు ప్రమాదం.. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్.. ఇంకెతమంది ప్రాణాలు బలితీసుకుంటారో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయినా ఇంత విషాద సమయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి గానీ.. జోకులు వేయకూడదని చంద్రబాబు పై సెటైర్లు వేస్తున్నారు.