సినిమా: పక్కా కమర్షియల్
నటీ నటులు:గోపీచంద్,రాశీ ఖన్నా,రావు రమేష్,సత్య రాజ్
దర్శకుడు: మారుతి
మ్యూజిక్: జేక్స్ బీజోయ్
సినిమాటోగ్రఫి: కర్మ్ చావ్లా
నిర్మాత: బన్నివాస్
ప్రొడక్షన్ : గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్
మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. మొదలైప్పటినుండి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుడు అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు నిలబెట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
న్యాయమూర్తిగా ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని తన వృత్తిని వదిలేస్తాడు సూర్య నారాయణ (సత్య రాజ్). న్యాయం చెయ్యాలంటే లాభం ఉండాల్సిందే అని పంథాలో ముందుకు వెళ్తాడు సూర్యనారాయణ కొడుకు లక్కీ (గోపి చంద్). న్యాయ వృత్తిని వదిలేసిన సూర్యనారాయణ మళ్ళీ లాయర్ గా మారడానికి కారణం ఏంటి.?
ఒక కేసును తన కొడుకు లక్కీ కి వ్యతిరేకంగా వాదించడానికి కారణం ఏంటి.? లాయర్ గా ఝాన్సీ ( రాశిఖన్నా) పాత్ర ఏమిటి.? వీటి మధ్యలో రావు రమేష్ పాత్ర ఏంటి తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ:
గోపీచంద్ లో ఆడియన్స్ ఎప్పటినుంచో మిస్ అయినా యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు మారుతి. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేసారు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ ఆకట్టుకుంటాయి. రావు రమేష్ విలనిజానికి కామెడీని జోడించి ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు.
కొన్ని రావు రమేష్ కామెడీ సీన్స్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయ్యాయి.
తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి.అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితర నటులు తమకున్న పరిధిలో వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు. జేక్స్ బీజోయ్ మ్యూజిక్ ఈ సినిమాకి కలిసొచ్చింది. నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
మొత్తంగా:
వినోదాన్ని నమ్ముకుని, కాసేపు నవ్వుకుందాం అనుకునే ప్రేక్షకులను మెప్పించే చిత్రమే పక్కా కమర్షియల్.
రేటింగ్: 3.25/5