యాంకర్‌గా కెరియర్ ప్రారంభించి దర్శకుడిగా అవతారమెత్తిన వారిలో ప్రభాకర్ ఒకరు. అయితే ప్రభాకర్‌కు యాంకర్‌గా ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టాయి. ఓ ప్రముఖ ఛానెల్ వ్యవస్థాపకుడికి, ప్రభాకర్‌కు చెడిందని, దీంతో ఓ ప్రోగ్రామ్ నుంచి ప్రభాకర్‌ను యాంకర్‌గా తీసేశారనే గాసిప్స్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రభాకర్ దర్శకుడిగా మారి రూపొందించిన నెక్స్ట్ నువ్వే చిత్రం థియేటర్లలో విజయవంతం ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా ప్రభాకర్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెక్ట్స్ నువ్వే చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో చిత్రంలోని నటీనటుల గురించి మాట్లాడుతూ.. హీరో ఆది చాలా సహజ నటుడని, అతను ఏ క్యారెక్టర్‌లో అయినా అట్టే ఇన్వాల్వ్ అయిపోతాని ప్రశంసించారు. ఇక హీరోయిన్ వైభవికి తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా కూడా, చాలా బాగా చేసిందన్నారు. హీరోయిన్ వైభవికి తెలుగు రాకపోయినా డైలాగ్స్‌ను చాలా క్లియర్‌గా చెప్పగలిందన్నారు డైరెక్టర్ ప్రభాకర్.
ఇకపోతే రష్మీగురించి చెప్తూ.. తను ఒక బెస్ట్ ఎసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నారు. రష్మీ యాక్టింగ్, బిహేవియర్, క్యారెక్టర్ అంతా సినిమాకు పెద్ద ఎసెట్ అయిందన్నారు. చిత్రం అనుకున్న సమయానికి ఫినిష్ అవడానికి కారణం రష్మీనే అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ మొత్తం ఒక టీమ్‌లాగా సినిమా కోసం కష్టపడ్డారని, వారి కష్టంతోనే సినిమా సక్సెస్ అయిందంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ప్రభాకర్.