టాలీవుడ్ లో ‘ఆనందోబ్రహ్మ’, బాలీవుడ్ లో ‘జుద్వా 2’ సినిమాల విజయాలతో ఉపూ మీద ఉన్న హీరోయిన్ తాప్సీ డేటింగ్‌లో ఉంది.. అనే ప్రచారం జరుగుతోంది. అది కూడ ఒక విదేశీయుడితో కావడం గమనార్హం. డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘మిడ్ డే ’ ఒక వార్తను ప్రచురించింది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కథనాన్ని రాసినట్టుగా ఆ పత్రిక పేర్కొంది. ఇది వరకూ కూడా తాప్సీ విషయంలో ఇలాంటి రూమర్లు వచ్చాయి. ఒక దక్షిణాది హీరోతో ఆమె సన్నిహితంగా నడుచుకుంటోందని అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత అవి తెరమరుగు అయ్యాయి.
ఈ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో తాప్సీకి ఎలా పరిచయం అయ్యింది? అంటే.. అతడు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఆడుతున్నప్పుడు వీరికి పరిచయం అయ్యిందని, అటుపై డేటింగ్ అని మిడ్ డే కథనంలో పేర్కొన్నారు. 37 సంవత్సరాల వయసున్న మథియస్ ఒలింపిక్స్ మెడలిస్టు కూడా. మరి అతడితో సాన్నిహిత్యపు వార్తల గురించి తాప్సీ ఇంకా స్పందించలేదు.