తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది.
వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు L&T, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చూడాలి మరి.