Home / LIFE STYLE / ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ అనే సంస్థ సెల్‌ టు ప్యాక్‌ (సీటీపీ) థర్డ్‌ జెనరేషన్‌ సాంకేతికతతో ‘క్విలిన్‌’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది.

2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. ఈ బ్యాటరీల ఎక్కువ కాలం మన్నడమే కాకుండా, భద్రత విషయంలో కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు. పైగా చార్జింగ్‌ చాలా వేగంగా అవుతుందని పేర్కొంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat