త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌ను కేసీఆర్ ఆదేశించారు.
తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం అందించనుంది.