ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు .
అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ ప్రమాదం అనంతరం సదరు స్విమ్మరు మాట్లాడుతూ టీడీపీ సర్కారు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు .భద్రతచర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగింది .ఇది ముమ్మాటికి ప్రభుత్వం వైపల్యం అని ఆయన అన్నారు.
అంతే కాకుండా బోటులో స్పీడ్ బోటు లేదు .అది ఉంటె ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది చనిపోయేవారు కాదు .తాను వెళ్లి గొడ్డలి ,సుత్తి తెప్పించుకొని మరి బొటుకు రంధ్రం చేయడంతోనే ముగ్గురు నలుగురు ప్రాణాలను కాపాడాను .సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రమాదం జరిగితే 108 కి సమాచారం ఇచ్చాను కానీ ఎవరు త్వరగా స్పందించలేదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు.