ఏపీ అధికార పార్టీ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి విధితమే. అయితే అనంత్ బాబుకు చెందిన బెయిల్ పిటిషన్ ను రాజమహేంద్రవరం SC, ST కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ మంజూరుకు నిందితుడు అనంతబాబు తరపున న్యాయవాది సరైన కారణాలు చూపకపోవడంతో పిటిషన్ రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
Tags anantababu andhrapradeshcm andhrapradeshcmo arrest Driver driver murder slider ys jagan ys jaganmohanreddy ysrcp ysrcpmlc