ప్రతి రోజూ మనం చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు. .చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజూ ఒక గంట లేదా అరగంట యోగా చేస్తే శరీరానికి చాలా మంచిదని, చిన్న చిన్న జబ్బులు కూడా యోగాతో తగ్గిపోతాయన్నారు.
రోజుల క్రితం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారని ఆయన 24 దేశాలల్లో 30 వేల కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించారని చెప్పారు. మనిషి శరీరం బాగుంటేనే మనం ఎన్నోరకాల కార్యక్రమలు చేయగలమని అందుకు యోగా తప్పకుండా చేయాలని సూచించారు.