తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని ఉన్నత విద్యా శాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వాటిలో యూనివర్సిటీల్లో అత్య ధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్ (1,523), కళాశాల విద్య కమిషనరేట్ (546), సాంకేతిక విద్య కమిషనరేట్ (568), 11 యూనివర్సిటీల పరిధిలో 2,374 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది.