ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ,తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ మహా నగర మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత ,పార్టీకి చెందిన క్యాడర్ ,నేతలు కొంచెం నిరాశలో ఉన్న సంగతి విదితమే .
కానీ ఆ పార్టీ అధినేతకు ,పార్టీ శ్రేణులకు మంచి ఊపు వచ్చే నిర్ణయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది .గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ,టీడీపీ పార్టీలు కుట్రలు పన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కల్గి ఉన్నాడు .నకిలీ కంపెనీలు కల్గి ఉన్నాడు .ప్రభుత్వ సొమ్మును లక్షల కోట్లు దోచుకున్నాడు అని అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే .అయితే ఈ రెండు పార్టీలు కుట్రపూరితంగా పెట్టిన కేసులను సీబీఐ న్యాయస్థానం గత మూడున్నర ఏండ్లుగా అక్రమంగా బనాయించిన కేసులు అని కొట్టివేస్తోన్న సంగతి విదితమే . తాజాగా కేంద్రం జగన్ కు అనుకూలంగా ఒక ప్రకటనను చేసింది .
అదే దేశంలో అక్రమాలు ,నకిలీ కంపెనీలు ఉన్న వారి జాబితాను ఇటీవల కేంద్రం ప్రకటించింది .ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోటరికి చెందిన ముఖ్య నేత ,ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన సుజనా చౌదరి ,బాబుకు నిత్యం భజన చేస్తూ ..తిమ్మిని బమ్మి చేసే ఆస్థాన మీడియా వర్గాల్లో ఒకటైన స్టూడియో ఎన్ ఛానల్ అధినేత ,బాబుకు అత్యంత ఆత్మీయుడు నార్నేశ్రీనివాసరావు ,రెడ్డి ల్యాబ్స్ అధినేత పేర్లను కేంద్రం ప్రకటించింది అని వార్తలు వస్తోన్నాయి .కానీ జగన్ కానీ జగన్ కు చెందిన వారి ,ఆ పార్టీ శ్రేణుల పేర్లు లేవు అని కేంద్రం తేల్చి చెప్పింది .అయితే చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్ పై చేస్తోన్న ఆరోపణలు అన్ని బోగస్ అని కేంద్రం తేల్చి చెప్పినట్లు అయింది ఈ ఒక్క ప్రకటనతో .నిత్యం తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలను తిప్పికోడుతున్న వైసీపీ అధినేతకు ,ఆ పార్టీ శ్రేణులకు ఇది శుభవార్తే కదా ..