తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్సేవక్లు, పోస్ట్మ్యాన్లు ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారని చెప్పారు. అంగన్వాడీల ద్వారా పిల్లల ఆధార్ నమోదుకు మహిళా శిశు సంక్షేమశాఖతో అంగీకారం కుదుర్చుకొన్నట్టు తెలిపారు.