తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ నిన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ త్వరలో దిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు.
రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతున్నదని, కేసీఆర్ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాలని సూచించారు.