టీమిండియా యువ క్రికెటర్ భువనేశ్వర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న భువీ తన ప్రేయసి నుపుర్ నగార్‌ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్‌షహర్‌లో రిసెప్షన్ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరుగుతుంది. మీరట్‌లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. కానీ భువి జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్ లో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాం..కానీ ఆ టైంలో వీలు కాక పోవడంతో..వారి కోసం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు భువనేశ్వర్ తండ్రి కిరణ్‌పాల్ సింగ్ తెలిపారు. అందరూ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నాం. ఎందుకంటే శ్రీలంకతో సిరీస్ కోసం జట్టంతా నవంబరు 30న ఢిల్లీలోనే ఉంటుందని తెలపారు.