Home / SLIDER / టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం అంశాల వారీగా గ్రామాభివృద్ధిపై సమీక్షించారు.

గ్రామానికి మిషన్ భగీరిథ నీరు వస్తుందా? ట్రాక్టర్ గ్రామంలో ఎన్ని గంటల నుంచి తిరుగుతున్నది? డంపింగ్ యార్డు పని చేస్తున్నదా? తడి పొడి చెత్త వేరు చేసి ఎరువులు తయారు చేస్తున్నారా? ఎంత మేర ఆదాయం సమకూరుతుంది? వైకుంఠ ధామం పనిలోకి వచ్చిందా? వినియోగిస్తున్నారా? సంక్షేమ పథకాలు వస్తున్నాయా? వంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat