వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్ నుండి జన సంద్రోహం మద్య జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు అమృతనగర్, చెన్నమ్మపేట, కమననూరు, రాధా నగర్, నేలటూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబల్లి క్రాస్ రోడ్డు, దువ్వూరు మీదుగా ప్రాజా సంకల్ప యాత్ర సాగనుంది.
