యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
ఈ చిత్రంలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుందట. స్టోరీ పెద్దగా ఏమీ లేకున్నా..కామెడీతో లాక్కొచ్చారని చెబుతున్నారు. సినిమా యావరేజ్‌గా ఉందని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఎఫ్3 మూవీ చాలా బాగుంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ అదిరిపోయింది. లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎఫ్2 కంటే ఎఫ్3 బాగుంది. ఫస్టాఫ్ వెంకటేశ్ ఎప్పటిమాదిరే తనదైన కామెడీతో నవ్వించాడు.
ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని కామెడీ సీన్స్ మినహా..మిగతాదంతా బోరింగ్‌గా ఉందని, ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాలేవని చెబుతున్నారు.
ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. మొదటి 15 నిమిషాలు సాగదీతగా అనిపిస్తుంది. కామెడీ ఓకే. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీ అదరిపోయింది. మూవీ చాలా బాగుందంటూ మూడు స్టార్లు ఇచ్చాడు ఓ నెటిజన్.