Home / SLIDER / ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో లూలు గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో లూలు గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడి

దావోస్ లో జరుగుతున్న  ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) సమావేశాల్లో తొలి రోజే తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో నిన్న సోమవారం వివిధ కంపెనీల ప్రతినిధులు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. తెలంగాణ నుంచి యూరప్‌ సహా వివిధ విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు త్వరలో తమ యూనిట్‌ను ప్రారంభిస్తామని, దీనిపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు.దీంతో ఇందుకు అవసరమైన అనుమతి పత్రాలను మంత్రి కేటీఆర్‌ ఆయనకు అందజేశారు.

తెలంగాణలో కేవలం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనే కాకుండా భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కూడా లూలు గ్రూపు మరిన్ని పెట్టుబడులను పెట్టనున్నట్టు యూసుఫ్‌ అలీ తెలిపారు. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాపర్టీల యజమానులతో మాట్లాడుతున్నామని వివరించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన షాపింగ్‌ మాల్‌ను నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat