ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, నేతలిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న విషయం ఇంకా తెలియరాలేదు.