యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్.
థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సంబరాలు జరుపుకొంటున్నారు.