మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ అయ్యే అవకాశముంది. ఇదే నిజమైతే మండు వేసవిలో మందు బాబులకు మాత్రం కచ్చితంగా ఇది కాస్త చేదువార్తే