Home / SLIDER / అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు

అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు

దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి.

రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కారణంగా గత ఐదేండ్లలో రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల విలువైన మత్స్య సంపద చేతికొచ్చింది. ఈ సంపద ప్రతి మత్స్యకారుడికి చెందాలన్న ఉద్దేశంతో మత్స్యశాఖ సొసైటీలను బలోపేతం చేస్తున్నది.

అర్హులైన ప్రతి ఒక్కరికి సొసైటీల్లో సభ్యత్వం కల్పించేందుకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి మత్స్యకారులకు నైపుణ్య పరీక్ష (వల అల్లడం, వల విసరడం, చెరువులో నడవడం, ఈత కొట్టడం)లు నిర్వహిస్తున్నారు. ఒక నెలలోనే 419 సొసైటీలను ఏర్పాటుచేసి, 10,566 మందికి సభ్యత్వం కల్పించారు. మరో నెల రోజుల్లో 1,177 కొత్త సొసైటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat