మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్ ప్రాన్సిస్ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల కుటుంబంలో 1712లో నీలకంఠ పిళ్లై పెట్టారు. ఆయన 1745లో క్రిస్టియానిటీని స్వీకరించి దేవసహాయం పిళ్లైగా మారారు.ట్రావెన్‌కోర్ రాజు మార్తాండ వర్మ కొలువులో అధికారిగా ఉన్న పిళ్లై.. మతమార్పిడి కారణంగా ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 1752 జనవరి 14న ఆయనకు ఉరిశిక్ష వేశారు.