తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.