తెలంగాణకు మేలు చేసే టీఆర్‌ఎస్ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్సే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పారు. 70 ఏళ్లలో కాని పనులు ఈ ఏడేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పూర్తయ్యాయన్నారు.