తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ‘
మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో స్కూల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తమ పూర్వీకుల ఇంటిని కేటీఆర్ సందర్శించారు. వందల ఎకరాలు ఉన్న కుటుంబంలో సీఎం కేసీఆర్ పుట్టారని.. కొందరు మాత్రం ఆయన్ను ఫాంహౌజ్ సీఎం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు.