రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే ఉన్నాయని.. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ గ్రామాలు ఎందుకు ఎంపిక కాలేదని కేటీఆర్ నిలదీశారు.