ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.