దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు.
మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.గత 24 గంటల్లో 2755 మంది కోలుకోగా, 50 మంది మృతిచెందారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరిందని చెప్పింది. 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది.