దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు.
భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వెల్లడించిందన్నారు. ఇంతటి పురోగతిని ఒక రాష్ట్రం సాధించగలిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎందుకు సాధించలేవని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందనేదాన్ని సరైన సమయంలో కేసీఆరే వెల్లడిస్తారన్నారు.