ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆ పార్టీకే గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ ఈ బోడి రాజకీయాలు నాకేందుకు..?.
నాకు మంత్రి పదవి రాకుండా ఆధిష్టానం దెబ్బకొట్టింది. నేను కూడా నా శైలీలో తిరిగి దెబ్బ కొడతా. నేనేమి అమాయకుడ్ని కాదు. వాళ్లు అలా అనుకుంటున్నారేమో నేను హింసావాదిని. పబ్లిక్ సమావేశాల్లో కూడా చెబుతా.. నాకు భయం ఏమి లేదు. కావాలంటే నన్ను జైల్లో పెట్టుకోమని వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఆగ్రహాం వ్యక్తం చేశారు.