వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు వస్తాయని, కొంచెం బాగా కష్టపడితే 60 నుంచి 70 సీట్ల వచ్చే చాన్స్ ఉందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ … తమ పార్టీలో పాదయాత్రలకు అనుమతి ఇవ్వరని.. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేస్తానంటే గులాంనబి ఆజాద్ ఒప్పుకోలేదన్నారు. తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇస్తాడేమో చూడాలన్నారు. రాజీనామా చేస్తే.. ఉపఎన్నికల్లో రేవంత్‌కు ప్రచారం చేస్తామని అన్నారు .
